BRSలోకి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి

-

భువనగిరి జిల్లా కాంగ్రెస్ లో ఇవాళ సాయంత్రం కొద్ది క్షణాల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ జిల్లా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేసిన కాసేపటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రగతి భవన్ మెట్లెక్కారు. అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో చర్చలు జరిపిన నిమిషాల్లోనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు

తన అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌రెడ్డి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. భువనగిరి నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేస్తున్నది తప్పని అనిల్ కుమార్ రెడ్డి ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పట్ణణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఇవాళ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ విమర్శలు గుప్పించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఆయన  బీఆర్ఎస్ లో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news