పాలేరు పంచాయితీ..తుమ్మల వర్సెస్ ఉపేందర్..కేసీఆర్ ఎవరి వైపు?

-

అధికార బీఆర్ఎస్ పార్టీలో సీట్ల కోసం పోటీ నెలకొంది. ఎన్నికల సమయం దగ్గర పడటం..మరో నెలలో సి‌ఎం కే‌సి‌ఆర్..ఎమ్మెల్యే అభ్యర్ధుల మొదట లిస్ట్‌ని విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు. దీంతో ఆశావాహులు మొదట లిస్టులోనే తమ పేరు రావాలని చూస్తున్నారు. ఎవరికి వారు సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యేలు,  బి‌ఆర్‌ఎస్ నేతల మధ్య పోటీ ఎక్కువ ఉంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్, టి‌డి‌పిల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇక వారిపై ఓడిపోయిన బి‌ఆర్‌ఎస్ నేతలు..ఈ సారి సీటు దక్కించుకుని గెలవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పాలేరు సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఉపేందర్ రెడ్డి గెలవగా, బి‌ఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఉపేందర్ బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. దీంతో అసలు రచ్చ ఇక్కడే మొదలైంది. అక్కడ తుమ్మల హవా తగ్గించేలా ఉపేందర్ రాజకీయం నడుపుతున్నారు.

ఇటు తుమ్మల కూడా వెనక్కి తగ్గకుండా రాజకీయం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఆయనకు పట్టున్న విషయం తెలిసిందే కాబట్టి పాలేరు సీటు తనకే ఇస్తారని తుమ్మల ఉన్నారు. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాబట్టి తనకే సీటు ఇస్తారని ఉపేందర్ రెడ్డి చూస్తున్నారు. ఇలా ఎవరికి వారు సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరిలో కే‌సి‌ఆర్ ఎవరికి వైపు ఉన్నారు. అక్కడ సర్వేలు ఏం చెబుతున్నాయనేది క్లారిటీ లేదు.

అయితే ఒకటి..ఒకరికి సీటు ఇచ్చి మరొకరికి సీటు రాకపోతే..వారే సొంత పార్టీని ఓడించే పరిస్తితి ఉంటుంది. అలాగే వేరే పార్టీలోకి జంప్ అయ్యి పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి పాలేరు సీటు విషయంలో కే‌సి‌ఆర్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news