కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. చాలా మందికి వాటిపై అవగాహన కూడా ఉండదు. చాలా తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించేవి ఉన్నాయి. మనలో చాలా మందికి రాష్ట్రం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి తెలిసి ఉంటుంది కానీ కేంద్రం అందించే పథకాల గురించి పెద్దగా పట్టించుకోరు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రం ఒక పథకం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ ఫసల్ యోజన, పీఎం మంధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా కూడా ఆర్థికంగా సహాకారం అందజేస్తోంది. తాజాగా మరో రుణ హామీ స్కీమ్‌ను అమలు చేస్తోంది.
పశుసంవర్ధక రంగంలో ఉన్న ఎంఎస్‌ఎఈలకు కేంద్రం నిధులను విడుదల చేయనుంది. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. లోన్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం, పశుసంవర్ధక రంగంలో నిమగ్నమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి గ్యారంటీ లేకుండా నిధులను అందజేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ స్కీమ్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.750 కోట్లతో క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఇది అర్హత కలిగిన లోన్ కంపెనీలు ఎంఎస్‌ఎంఈలులకు విస్తరించిన క్రెడిట్ సౌకర్యాలలో 25 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని అందిస్తుంది. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కు అర్హత లేని.. తక్కువ సేవలందిస్తున్న పశువుల రంగానికి ఫైనాన్స్ యాక్సెస్‌ను ఈజీగా అందజేస్తుంది.
ఏఐహెచ్‌డీఎఫ్ పథకం కింద మూడు శాతం వడ్డీ రాయితీ, ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) నుంచి మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం వరకు లోన్ పొందే అవకాశం కల్పిస్తోంది.
బ్యాంకుల్లో ష్యూరిటీ లేనిదే ఎలాంటి రుణం కల్పించరు. అలాంటిది కేంద్రం అందించే ఈ పథకం ద్వారా గ్యారెంటీ లేకుండానే రైతులు రుణాలు పొందవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది.