నారా రోహిత్​ ‘ప్రతినిధి 2’ కాన్సెప్ట్​ టీజర్ ​రిలీజ్

-

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ ఇటీవలే తన కొత్త సినిమాను ప్రకటించారు. అప్పట్లో వచ్చిన పొలిటికల్ డ్రామా ప్రతినిధికి సీక్వెల్​గా ప్రతినిధి-2తో త్వరలో ముందుకు రానున్నట్లు ఇటీవలే అప్డేట్ ఇచ్చారు. అయితే ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రతినిధి-2 మూవీ మేకర్స్ కాన్సెప్ట్ టీజర్​ను రిలీజ్ చేశారు. ఈ వీడియో బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్​తో సాగింది. వార్తాపత్రికలను బాగా హైలైట్ చేస్తూ వీడియోలో చూపించారు.

సమాజంలో జరిగే అసమానతలను ఎదుర్కొనేందుకు ఒక్కడు నిలబడతాడు అంటూ మళ్లీ ఫస్ట్ లుక్​ పోస్టర్​ బాగా లార్జ్​ సైజ్​లో చూపించి ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంట్రెస్టింగ్​గా సాగింది. మొత్తంగా ఈ టీజర్​ చూస్తుంటే ఇది ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్‌ థ్రిల్లర్​గా సినిమా రాబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. వానరా ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్‌పై.. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news