మనము బ్రతకడానికి అవసరం అయిన ఆహారాన్ని తయారుచేసుకోవడానికి ఏ కూర చేయాలన్నా టమోటా అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా టమోటాలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క టమోటా కిలో ధర 100 కు పైగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు కేవలం టమోటాను కొనడానికి వంద పెడితే మిగిలిన అవసరాల విషయం ఏమిటి ? కాగా తాజగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రోజు టమోటా ల ధర ఇంకా పెరిగిందట. అన్నమయ్య జిల్లా మదనపల్లె లో టమోటా ల ధరలు విపరీతంగా ఉన్నాయి. ఈ రోజు మదనపల్లె మార్కెట్ లో ఒక కిలో నాణ్యంగా టమోటా ధర రూ. 168 కు వెళ్ళింది. ఇందులో ఏ గ్రేడ్ రూ. 140 నుండి 168 పలికింది. బి గ్రేడ్ రూ. 118 నుండి 138పలికింది. నిన్నటి వరకు టమోటా కేజీ రూ. 140 ఉండగా ఒక్క రోజులో ఇంత స్థాయిలో పెరగడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
ఇంకా పడుతున్న వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గడంతో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ధర పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.