వంగవీటి వారసురాలు పోలిటికల్ ఎంట్రీ? నిజమెంత?

-

వంగవీటి రంగా..ఏపీ రాజకీయాల్లో ఎదురులేని నాయకుడు. కాపు సామాజికవర్గానికి ప్రతినిధి. కాపు వర్గం ఎదుగుదల కోసం కృషి చేసిన నేత. కేవలం కాపు వర్గమే కాదు పేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన నాయకుడు. అందుకే ఆయన మరణించిన..ఆయన పేరు చిరస్థాయిగా వినపడుతూనే ఉంటుంది. ఇక వంగవీటి వారసుడుకు రాధా కూడా కాపు వర్గంతో పాటు పేద వర్గాల బాగు కోసంపాటు పడుతున్నారు.

అయితే ఈయన రాజకీయంగా పెద్దగా సక్సెస్ కాలేదు. 2004 ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఈయన..వైఎస్సార్ చొరవతో 2004 లో కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పులో పోటీ చేసి గెలిచారు. ఇక 2009లో చిరంజీవి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అప్పుడు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ప్రజారాజ్యం..కాంగ్రెస్ లో విలీనమైన విషయం తెలిసిందే. అయితే ఈయన కాంగ్రెస్ వైపుకు వెళ్లకుండా వైసీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Vangaveeti Ranga' daughter

ఇక వైసీపీలో ప్రాధాన్యత లేకపోవడం, తన సొంత సీటు సెంట్రల్ సీటు దక్కకపోవడం లాంటి అంశాల నేపథ్యంలో ఆయన..వైసీపీని వదిలి టి‌డి‌పిలోకి వచ్చారు 2019లో పోటీ చేయకుండా టి‌డి‌పి కోసం ప్రచారం చేశారు. టి‌డి‌పి ఓడిపోయి అధికారం కోల్పోవడంతో రాజకీయాల్లో కనిపించడం లేదు. ఇక రంగా ఆశయాలని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

మధ్యలో ఈయన వైసీపీ లేదా జనసేనల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం వచ్చింది. కానీ ఎటు వెళ్లలేదు..అప్పుడప్పుడు టి‌డి‌పిలోనే కనిపించారు. లోకేష్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. దీంతో ఆయన టి‌డి‌పిలోనే ఉన్నారని తేలింది. ఇక ఈయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఇదే సమయంలో తన సోదరి, రంగా వారసురాలు ఆశ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం మొదలైంది.

మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇందులో వాస్తవం లేదని రంగా అనుచరులు అంటున్నారు. ఇదంతా మీడియా సృష్టి అని చెబుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. చూడాలి రంగా వారసురాలు సైతం రాజకీయాల్లోకి వస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news