గణేష్ డ్యాన్సర్ కు నాని బంపరాఫర్

-

తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు గణేష్ నవరాత్రుల ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సినిమాల్లో ప్రత్యేకంగా గణేష్ సాంగ్స్ చాలా ఫేమస్. అఫ్కోర్స్ అవే ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రుల పాటల్లో పెడతారనుకోండి. 9 రోజులు పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేసే బొజ్జ గణపతిని ఊరేగించే సందర్భంలో తీన్మార్ డ్యాన్స్ కు అద్భుతంగా చేస్తారు. ఊరు పొడుగూతా ఈ డ్యాన్స్ హంగామా ఉంటుంది.

అయితే నాచురల్ స్టార్ నాని ఇలా గణేష్ నవరాత్రులలో డ్యాన్స్ వేసిన వారికి.. నిమజ్జనం టైంలో డ్యాన్స్ చేసిన వారికి ఓ ఆఫర్ పెట్టాడు. ఎవరైనా ఎలాంటి డ్యాన్సైనా చేసి నానికి పంపిస్తే అది నచ్చితే ఆ డ్యాన్స్ చేసిన వారికి గిఫ్టులు పంపిస్తాడట. డ్యాన్స్ విత్ దేవదాస్ అంటూ ఈ కాంటెస్ట్ గురించి సర్ ప్రైజ్ గా వీడియో మెసేజ్ ఇచ్చాడు నాని.

నాగార్జున, నానిలు కలిసి చేస్తున్న దేవదాస్ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. వినాయక చవితి సందర్భంగా సినిమాలోని లక లక లకుమికర సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ లో నాగ్, నానిల డ్యాన్స్ హంగామా అదిరిపోద్దట. అందుకే నాని ఈ వినాయక చవితికి ఎవరు మంచి డ్యాన్స్ తో అలరిస్తారో వారికి స్పెషల్ గిఫ్టులు అందిస్తున్నాడట. మరి డ్యాన్స్ విత్ దేవదాస్ కాంటెస్ట్ కు మీరు రెడీ అయిపోండిక.

Read more RELATED
Recommended to you

Latest news