చరణ్ కు ఇది అవమానమే సుమా..!

-

మెగా పవర్ స్టార్ సినిమాలో హీరోయిన్ గానే కాదు స్పెషల్ అప్పియరెన్స్ ఛాన్స్ వస్తేనే ఎవరు వదులుకోవాలని అనుకోరు అలాంటిది రాం చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అవకాశం వచ్చినా అది కాదని యువ హీరో సినిమాలో ఐటం సాంగ్ కు ఓకే చెప్పింది ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. చరణ్ ఛాన్స్ మిస్ చేసుకున్న అమ్మడు అదే ప్లేస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఐటం సాంగ్ చేస్తుందట.

చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ గా నర్తించేందుకు పాయల్ ను అడిగారట. అమ్మడు ఎందుకో ఆ సాంగ్ ను కాదనేసిందట. అయితే తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమాలో మాత్రం పాయల్ ఐటం సాంగ్ కు సిద్ధమైందట. చరణ్ సినిమా ఛాన్స్ వదులుకుని శ్రీనివాస్ తో జతకట్టడం మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు.

ఆరెక్స్ 100లో ముద్దుల హంగామా చేసి తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించిన పాయల్ రాజ్ పుత్ మెగా ఛాన్స్ ఎందుకు వదులుకుందో మాత్రం అర్ధం కావట్లేదు. ప్రస్తుతం పాయల్ కాదన్న ఆ సాంగ్ ను మరో హీరోయిన్ చేత చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సాంగ్ హిట్టైతే మాత్రం పాయల్ ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్సైనట్టే లెక్క.

Read more RELATED
Recommended to you

Latest news