పోలీసులకు సీఎం వరాలు.. రొటేషనల్ వీకాఫ్.. 15 లీటర్ల పెట్రోల్ ఫ్రీ

-

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర పోలీసులపై వరాలు కురిపించారు. రొటేషన్ పద్దతిలో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ వాహనం సదుపాయంలేని స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసులందరికీ నెలకు 15 లీటర్ల పెట్రోలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన పోలీసులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తామని సీఎం ఇచ్చారు.

పోలీసుల పౌష్ఠికాహార భత్యాన్ని రూ.650 నుంచి రూ. 1,000కి పెంచుతున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం ప్రకటించారు. విధులు నిర్వర్తించే సమయంలో ఇచ్చే భోజనం అలవెన్స్ను రోజుకు రూ.70 నుంచి రూ.100కు పెంచుతున్నామని చెప్పారు. యూనిఫాం అలవెన్స్‌ను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర పోలీసుల కోసం 25 వేల ఇళ్లను నిర్మిస్తామని.. అవి అర్హులైనవారికి అందజేస్తామని వెల్లడించారు.

ఈ మేరకు పోలీసుల కుటుంబాలతో భోపాల్లోని తన అధికారిక నివాసంలో సమావేశమైన అనంతరం ఈ వరాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర, రాష్ట్ర డీజీపీ సుధీర్ కుమార్ సక్సేనా, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news