“బ్రో” సినిమా పోస్టర్ ముందు బ్లేడుతో కోసుకున్న పవన్ అభిమాని

-

సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇందులో హీరోయిన్ గా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ ను ప్రస్తుతం అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, తాజాగా, “బ్రో” సినిమా పోస్టర్ ముందు బ్లేడుతో కోసుకున్నాడు పవన్ కళ్యాణ్ అభిమాని. మదనపల్లి లో బ్రో సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు అభిమాని బ్లేడుతో పలుమార్లు చేతిని కోసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్ చేశాడు పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ చాలా బాగా యాక్టింగ్ చేశారని చెబుతూ.. హల్చల్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news