Breaking : మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్

-

తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం షాపుల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పాత విధానం ద్వారానే లైసెన్సులు ఇవ్వనుండగా.. దరఖాస్తు, లైసెన్సుల ఫీజులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ నెల 3న జిల్లాల వారీగా ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇవ్వనుండగా.. ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 21న డ్రా ద్వారా మద్యం షాపుల లైసెన్సులు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2లక్షలుగా నిర్ణయించారు.

Telangana urged to extend licence of wine shops-Telangana Today

అయితే.. ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలై 18వ తేదీ వరకు కొనసాగుతుందని అబ్కారీ శాఖ తెలిపింది. ఈనెల 21వ తేదీన జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో డ్రా ద్వారా లైసెన్స్​ల ఎంపిక కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న మద్యం లైసెన్స్​ల గడువు ఈ ఏడాది నవంబరు 30వ తేదీ వరకు ఉంది. ఈ నెలలో మద్యం లైసెన్స్​ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినప్పటికీ.. వీరి లైసెన్స్‌లు ఈ ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి చెల్లుబాటు అవుతాయని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి లైసెన్స్​లు తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news