మంత్రి పదవికి రాజీనామా చేసి అంబటి.. సినిమాలు తీసుకోవాలి – ఎంపీ రఘురామ

-

సాగునీటి పారుదల శాఖామంత్రిగా అంబటి రాంబాబు రాజీనామా చేసి తనకిష్టమైన సినిమాలను నిర్మాణం చేయవచ్చునని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నీటి పారుదల శాఖపై ఫోకస్ చేసే వారిని మంత్రిగా నియమించాలని రఘురామకృష్ణ రాజు చురకలు అంటించారు. అంబటి రాంబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారంటే సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతారేమోనని అనుకున్నానని, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్య ఉంటూ, రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో వివరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నందికొట్కూరులో ఆయన నిర్వహించిన సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.


గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 14 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్టు చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారని, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్లలో కేవలం రెండు కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేదని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పకుండా, పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన బ్రో చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యిందని అంబటి రాంబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

పవన్ కళ్యాణ్ తనకున్న స్టార్ డమ్ కు తీసుకోవాల్సిన అంత రెమ్యూనేషన్ తీసుకోకుండా, రీజనబుల్ గానే రెమ్యూనేషన్ తీసుకుంటున్నారని, ఇతర అగ్ర హీరోల హిట్ సినిమా వసూలు చేసే కలెక్షన్లను, పవన్ కళ్యాణ్ గారు నటించిన ప్లాప్ సినిమా కలెక్ట్ చేస్తుందని అన్నారు. బ్రో చిత్రం హిట్ అని అందరికీ తెలుసునని, ఇప్పటికే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని, అంబటి రాంబాబు గారు చెబుతున్న లెక్కల ప్రకారమే బ్రో చిత్రం 70 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని, మరో మూడు నాలుగు రోజుల్లో 20 కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తే ఆయన లెక్క ప్రకారం బ్రో హిట్ సినిమా అన్నట్టేనని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కనీసం రెండు కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేయలేదని, రాంగోపాల్ వర్మ గారి దర్శకత్వంలో రూపొందిస్తున్న వ్యూహం సినిమా సూపర్ హిట్ అయితే నాలుగు కోట్ల రూపాయల కలెక్ట్ చేస్తుందని, అట్టర్ ఫ్లాప్ అయితే 40 లక్షల రూపాయలు కూడా వసూలు చెయ్యదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news