స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడన్న విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే విక్రం కె కుమార్ డైరక్షన్ లో బన్ని సినిమా ఉంటుందని టాక్. అయితే అల్లు అర్జున్ ఇచ్చిన సలహాలు విక్రం ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కేలా ఉందని అంటున్నారు. ఇక ఈమధ్యనే దిల్ రాజు బన్ని కోసం ఓ క్రేజీ స్టోరీ తెచ్చాడట.
ఓ అప్కమింగ్ రైటర్ ఈ కథ రాశాడని తెలుస్తుంది. ఆ కథకు టైటిల్ గా సభకు నమస్కారం అని పెట్టారట. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడితో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం బన్ని, దిల్ రాజు దర్శకుల వేటలో పడ్డారట. డిజే హరీష్ శంకర్ ఖాళీనే ఉన్నా దిల్ రాజుతో ఈమధ్యనే గొడవై దూరమయ్యాడు. మరి ఈ సభకు నమస్కారం బన్నితో ఎవరు చేయిస్తారో చూడాలి.
ఇక తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్ దర్శకుడు లింగుసామి కూడా బన్నితో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. పందెం కోడి సీక్వల్ పూర్తి కాగానే బన్ని ప్రాజెక్ట్ పై ఫైనల్ డెశిషన్ తెలుస్తుందట.