శైలజా రెడ్డి అల్లుడు టీజర్.. చైతు లుక్ అదుర్స్..!

-

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయెల్ లీడ్ రోల్స్ లో మారుతి డైరక్షన్ లో వతున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆగష్టు 31న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమాలో శైలజా రెడ్డిగా శివగామి రమ్యకృష్ణ నటిస్తుంది.

సినిమాలో ఆమె రోల్ ఎంత ప్రాధాన్యత ఉంది అన్నది టైటిల్ చూస్తేనే తెలుస్తుంది. ఇక సినిమా టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత చైతు లుక్ లో చాలా మార్పు వచ్చింది. ఇదవరకు కన్నా చైతు ప్లెసెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయెల్ కూడా హీరోయిన్ గా ఓకే అనిపించేలా ఉంది. టీజర్ లో కంటెంట్ చెప్పలేదు కాని గోపి సుందర్ మ్యూజిక్.. మారుతి టేకింగ్ బాగుంది.

మారుతి మార్క్ టీజర్ గా వచ్చిన ఈ శైలజా రెడ్డి అల్లుడు టీజర్ కూల్ గా అనిపించింది. చూస్తుంటే ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా మరోసారి మారుతి తన ప్రతిభ కనబరిచేలా ఉన్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆగష్టు 31 దాకా వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news