అవ‌య‌వ దానాల్లో దేశంలోనే తెలంగాణ అగ్ర‌స్థానం – మంత్రి హరీష్ రావు

-

అవ‌య‌వ దానాల్లో దేశంలోనే తెలంగాణ అగ్ర‌స్థానం అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవ దానం చేసిన కుటుంబాలను సన్మానించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు…. ఈ సందర్భంగా మాట్లాడారు. అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘ‌న‌త‌ను కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించిందన్నారు.

నేడు ఢిల్లీలో జ‌రిగే జాతీయ అవ‌య‌వ‌దాన కార్య‌క్ర‌మంలో తెలంగాణ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య మంత్రి చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందకుంటుంది. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు. కేసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల, కల్పించిన మౌలిక సదుపాయాల వల్ల ఇది సాధ్యం అయ్యిందని వివరించారు. అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా, మరొకరికి ప్రాణం పోయాలని ఆలోచించడం, అమలు చేయడం  గొప్ప విషయం. మీ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకం. బాధలో కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నానని తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌య‌వ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. 2022 సంవ‌త్సంర‌లో తెలంగాణ‌లో 194 మంది అవ‌య‌వ దానం చేశారు. త‌మిళ‌నాడు 156, క‌ర్ణాట‌క 151, గుజ‌రాత్ 148 అవ‌య‌వ‌దానాల‌తో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయని చెప్పారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news