Breaking : తొలిరోజు 44,870 మంది రైతులకు రుణమాఫీ

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ రుణమాఫీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అయితే.. రుణమాఫీ చెల్లింపుల కోసం ఆర్థికశాఖ నుండి రూ.167.59 కోట్లు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం నేడు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ రైతుల తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

CM KCR for Maharashtra on 1st – Namasthe Telangana

రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చిన విషయం కూడా తెలిసిందే. 2018లో మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారు.

2018లో ఇచ్చిన హామీ మేరకు రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్‌ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news