బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ తిట్లు మామూలుగా లేవుగా…

-

బిగ్‌బాస్ ఫినాలేకు చేరుకోవడంతో ఆయా కంటెస్టంట్స్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. తమ అభిమాన కంటెస్టంట్ ని పొగుడుతూనే…మిగతా వాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కంటెస్టంట్స్ మీద వచ్చిన ట్వీట్స్ ని బిగ్‌బాస్ హౌస్ లో చదివి వినిపించారు. మంగళవారం ఎపిసోడ్లో  ఒక్కో కంటెస్టంట్ మీద వచ్చిన పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్ చదివారు.

యాంకర్ సుమ కార్డ్స్ మీద రాసి ఉన్న కామెంట్స్ ఆయా సభ్యులకు ఇచ్చి చదివించారు.
దీని కంటే ముందు వరుణ్..ఫ్యాన్ ఒకరు ఫోన్ చేశాడు. నిజామాబాద్ నుండి రవి అనే కాలర్ వరుణ్ సందేశ్‌‌తో మాట్లాడారు. ఆ తర్వాత ఆయా సభ్యులకు వచ్చిన ట్వీట్స్ చదివారు. అందులో శ్రీముఖిపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. శ్రీముఖి జెండర్ కార్డ్ వాడుతుందని, కన్నింగ్ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే ఆమె బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ కూల్ అంటూ మరో ట్వీట్ వచ్చింది. ఇక వీటిపై శ్రీముఖి వివరణ ఇచ్చింది.

అనంతరం బాబా భాస్కర్‌కు…‘బాబా ఈజ్ బెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ 3. టాస్క్‌లో తోపు, వర్క్‌లో తోపు, ఎంటర్ టైన్మెంట్‌లో బాప్, డాన్స్ కా కింగ్, నో బ్యాక్ బిచ్చింగ్, లవ్స్ ఎవ్రీ వన్’ అంటూ తన అభిమాని పంపిన ట్వీట్‌ను చదివారు. అలాగే బాబాను మాస్కర్, ఊసరవెల్లి అంటూ నెటిజన్లు ఫైర్ అయిన ట్వీట్లను సైతం చదివి వినిపించారు. ఇక రాహుల్…ఎవరు ఏమన్నా స్మైల్‌తోనే ఆన్సర్ ఇచ్చే మంచి మనిషి’ అంటూ పాజిటివ్ ట్వీట్ వ‌చ్చింది.

ఇక రాహుల్‌ను నక్కతో పోల్చుతూ చాలా అగ్రిసివ్ అంటూ వచ్చిన నెగిటివ్ ట్వీట్స్‌ని చదివివినిపించాడు. నెక్స్ట్ వరుణ్ సందేశ్,అలీలు సైతం తమ గురించి వచ్చిన ట్వీట్లని చదివి వినిపించారు. దీని తర్వాత యాంకర్ సుమ..ఇంటి సభ్యులతో కలిసి దీపావళి వేడుకలని జరుపుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news