కొత్తిమీర సాగు చేసి రూ. కోటి సంపాదించిన రైతు..!

-

వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించుకోవడమే గగనం. ఆ వచ్చే డబ్బతో తెచ్చిన అప్పు తీర్చి, పిల్లల చదువులకు, ఇంట్లో ఖర్చులకు మహా అయితే కాస్త సేవింగ్స్‌ అంతే.. వ్యవసాయంతో ఏదో రియల్‌ ఎస్టేట్‌లో వచ్చిన అన్నీ డబ్బులు రావడం అంటే అస్సలు కుదిరేపని కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టమోటా రైతుల సుడితిరిగింది. కోట్లల్లో సంపాదిస్తున్నారు. ఈ రెండు మూడు నెలలు అంటే ధర పెరగడంతో వారికి లక్‌ కలిసి వచ్చింది. కొత్తిమీర సాగుతో కూడా కోట్లు సంపాదించవచ్చని మీకు తెలుసా..? మహారాష్ట్రకు చెందిన రైతు రమేశ్‌ విఠల్‌రావు కొత్తి మీర సాగు చేసి, ఐదేళ్లలో దాదాపు రూ.కోటి దాకా సంపాదించారు. అదెలా సాధ్యమైందో తెలుసుకుందాం.

రమేశ్ విఠల్‌రావు మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందినవారు. ఈ ఏడాది కొత్తిమీర సాగుతో సుమారు రూ.16 లక్షలకు పైగా ఆదాయం అందుకున్నారు. రమేశ్ 2019లో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. సాగు నుంచి వచ్చిన ఆదాయంతో గ్రామంలో ఓ ఎస్‌యూవీ, ఓ పెద్ద ఇల్లు కూడా కొన్నారట.

కొత్తిమీర పండించక ముందు అదే పొలంలో ద్రాక్ష పండించారు. 2015లో 3 ఎకరాల భూమిలో ద్రాక్ష సాగు చేసి, రూ.5 లక్షలు అందుకున్నారు. అప్పుడు కిలో రూ.10 చొప్పున 50 టన్నుల ద్రాక్షను విక్రయించారు. ద్రాక్ష సాగుకు అతనికి రూ.6.5 లక్షలు ఖర్చయింది. దీంతో ఆ పంట వదిలేసి, కొత్తిమీర పెంచడం ప్రారంభించారట.

కొత్తిమీర సాగుతో మారిన దశ

కొత్తిమీర సాగు చేసిన మొదటి సంవత్సరంలో రమేశ్ దాదాపు రూ.లక్ష పెట్టుబడితో రూ.25 లక్షలు సంపాదించారు. 2020లో రూ.16 లక్షలు, 2021లో రూ.14 లక్షలు, 2022లో రూ.16 లక్షలతో అతని సంపాదన వృద్ధి చెందుతూనే వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 16.30 లక్షలు సంపాదించారు. ఇలా ఇప్పటి వరకు రూ.కోటి వరకు సంపాదించారు. రమేశ్ సక్సెస్‌ స్టోరీ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చాలా మంది రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో లాభాలు పొందేందుకు కష్టపడుతున్నారు. వ్యవసాయానికి కాస్త టెక్నాలజీ జోడించి ఎప్పుడూ పండిచేవి కాకుండా లాభాలను ఇచ్చే వాటిపై దృష్టిపెడితే వ్యవసాయం కూడా మంచి వ్యాపారంగా మారుతుందని రైతు రమేష్‌ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news