రౌడీలకు రౌడీగా ఉంటాను – చంద్రబాబు

-

శుక్రవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికారు టిడిపి నేతలు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక్కడ రావణాసురుడు లాంటి ఎమ్మెల్యే ఉన్నాడని.. అతను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని హెచ్చరించారు. ఇతని అరాచకాలు హద్దు మీరాయని మండిపడ్డారు. మీరు కర్రతో వస్తే నేను కర్రలతో వస్తానని.. రౌడీలకు రౌడీగా ఉంటానని అన్నారు చంద్రబాబు.

కమిషన్ల కక్కుర్తి కోసమే వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. సహజ వనరుల దోపిడీని మంత్రి పెద్దిరెడ్డి తన తాత జాగీరు అనుకుంటున్నాడని ఆరోపించారు. రైతులను బెదిరించి బలవంతంగా భూములను లాక్కున్నారని విమర్శించారు. రైతులంటే లెక్కలేని తనంతో అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news