ఈ ఆలయానికి వెళ్తే మూగవాళ్లకు కూడా మాటలు వస్తాయట..!

-

భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. పిల్లలు పుట్టకపోతే ఆ ఆలయానికి వెళ్లండి. కచ్చితంగా సంతానం కలుగుతుంది. నరదిష్టి ఉంటే ఈ ఆలయానికి వెళ్లండి. వీసా రావాలంటే ఈ ఆలయానికి వెళ్లండి ఇలా చాలా ఉన్నాయి కదా..! కానీ మూగవాళ్లు ఆ ఆలయానికి వెళ్తే మాట వస్తుందట..! అసలు ఇదేంత వరకూ నిజం.! నిజంగానే మాట వస్తుందా..! కేవలం పుకారానే..? ఇంతకీ ఈ టెంపుల్‌ ఏడుంది.?

Bobadi Mata Temple
Bobadi Mata Temple

చుట్టూ కొండల మధ్య ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీన్ని బోబడి మాత ఆలయం అని పిలుస్తారు. ఈ ప్రత్యేక ఆలయం ఐదార్‌లోని ఈశ్వర్‌పూర్ గ్రామంలో ఉంది. ఈ టెంపుల్‌కు ఉన్న ప్రత్యేకతతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏమిటంటే మాట్లాడలేని వారు అమ్మవారి ఆలయానికి వచ్చి పూజలు చేస్తే కచ్చితంగా మాటలు వస్తాయని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. దీంతో బోబడి మాత ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్రత్యేకత కారణంగానే బోబడి మాత ఆలయాన్ని సందర్శించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రాజస్థాన్, అహ్మదాబాద్, సౌరాష్ట్ర నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. తమ కోరికలు నెరవేర్చుకోవడానికి వచ్చి పూజలు చేస్తారు.

ఈ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తున్న మాగాంబాయి పటేల్ అనే భక్తుడు చెబుతున్న దాని ప్రకారం.. ఈ ఆలయం 50 ఏళ్లకు పైగా పురాతనమైనది. బిడ్డ పుట్టి 5 సంవత్సరాలు గడిచినా మాట్లాడలేకపోయినా లేదా తమ బిడ్డ మాట్లాడలేడనే భయం ఉన్నా ఆ బిడ్డను బోబడి తల్లి వద్దకు తీసుకువస్తారట. బోబడి తల్లి మూగబిడ్డకు మాటలు తెప్పిస్తుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతుంటారు. కోరికలు తీరిన భక్తులు, పిల్లలకు మాటలు రావాలని బంగారం, వెండి నాలుకలను అమ్మవారికి కానుకగా సమర్పిస్తారట.

రాజస్థాన్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తమ కోర్కెలు తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా నత్తిగా మాట్లాడినా, బుద్ధి మాంద్యమైనా ఇక్కడికి తీసుకువస్తారు. అలాగే బోబడి మాత వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్య తొలగిపోతుంది.

దీనికి సంబంధించి ఒక పురాణగాథ ఉంది. దాని ప్రకారం ఐదార్ తాలూకాలోని జింజావా గ్రామంలోని ప్రజలందరూ ఈ ఆలయంలో బాబ్రీలో పాల్గొంటారు. జింజావా ప్రజలకు బోబడి మాపై గట్టి నమ్మకం ఉంది. చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా నత్తిగా మాట్లాడినా, బుద్ధి మాంద్యమైనా ఇక్కడికి తీసుకువస్తారు. అలాగే బోబడి మాత వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్య తొలగిపోతుంది. అమ్మవారిని నమ్ముకున్న వాళ్లకు అంతా మేలే చేస్తుందని ఇక్కడి జనం గట్టిగా నమ్ముతుంటారు.

పొగ లేకుండా నిప్పు రాదు.. ఈ మాత వల్ల నిజంగానే మాటలు వచ్చి ఉంటాయోమో లేకుండా ఇంత ఫేమస్‌ అవదు కదా..! ఏదైతేలేం.. ఎవరికైనా పనికివస్తుంది అనుకుంటే మాత్రం కచ్చితంగా ఆర్టికల్‌ షేర్‌ చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news