రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద ప్రజలందరికీ మంచినీళ్లు తాగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం.. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూర్చుంటారు.. మీరు అక్కడ ఉంటారో లేదో చూసుకోవాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. తమకు కట్టడం తెలుసునని.. విపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసునన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ కు కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బతుకులు ఆగమైతే.. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం చాలా డెవలప్ అయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు విశ్వసనీయత లేదన్నారు. కర్ణాటకలో గెలిచామని తెలంగాణలో కలలు కంటున్నారు. ప్రతిపక్షంలో భట్టి విక్రమార్క వందేళ్లు ఉండాలని కోరుకుంటున్నానని కేటీఆర్ చెప్పారు.