హైద‌రాబాద్ అమెరికాతో పోటీ ప‌డుతోంది : మంత్రి తలసాని

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్​ఎస్, కాంగ్రెస్​ నేతల మధ్య సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం కేసీఆర్​ పాలనలో హైద‌రాబాద్ న‌గ‌రం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. అమెరికాతో పోటీపడుతున్న నగరాన్ని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ లీడ‌ర్‌కు గ‌తి లేకుండా పోయింది అని త‌ల‌సాని ధ్వ‌జ‌మెత్తారు. హైద‌రాబాద్‌లో ఏం జ‌రిగిందో ఈ ప్ర‌పంచ‌మంతా చూస్తోంది. మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఒక నూత‌న‌మైన ఒర‌వ‌డిలో పెరుగుతున్న జ‌నాభాను దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, స్టీలు బ్రిడ్జిలు, లింక్ రోడ్లును అభివృద్ధి చేశారు. ఎస్ఆర్‌డీపీ కింద ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. నాలాల‌ను అభివృద్ధి చేశారు. క‌రెంట్, మంచినీటి విష‌యంలో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేవు. గ‌తంలో ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు నీటి క‌ష్టాలుండేవి. ఎల్ఈడీ లైట్లు, పార్కులు, ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేశాం. హైద‌రాబాద్ ప్ర‌జ‌లు చాలా సంతోషంగా ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news