ట్రాఫిక్ ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడానికి, రోడ్లపై భద్రతను నిర్ధారించడానికి, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దుర్గం చెరువు కేబుల్ వంతెనపై తమ వాహనాలను పార్కింగ్ చేయవద్దని ప్రయాణికులను కోరుతూ ప్రజా విజ్ఞప్తిని జారీ చేశారు. పార్క్ చేసిన వాహనాల నుండి వంతెనను సాఫీగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పడానికి పోలీసు శాఖ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. క్యారేజ్‌వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయొచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.