ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు ఆర్థిక సహాయం అందించేందుకు సమగ్ర విచారణ జరిపి అర్హులను ఎంపిక చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి 2 వ విడత దళిత బంధు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇది ఇలా ఉంటె, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సోమవారం అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మకు పాడె కట్టి ఊరేగించి దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 393 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.