ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చెయ్యద్దు.. పేలిపోతుంది..!

-

చాలాసార్లు ఫోన్ పేలిపోయింది అనే మాట వింటూ ఉంటాం. ఛార్జింగ్ లో ఫోన్ పెట్టేటప్పుడు ఈ పొరపాటులని చేయడం వలన ఫోన్ పేలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కి బ్యాటరీ చాలా ముఖ్యమైన భాగం. ఫోన్ లోని బ్యాటరీ వీక్ అయిపోయినా పాడైపోయిన ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ మనం బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లో యూనివర్సల్ ఛార్జింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుంది.

మీరు తప్పు చార్జర్ తో ఛార్జ్ చేయడం వలన బ్యాటరీ దెబ్బతింటుంది ఒరిజినల్ చార్జర్ తో మాత్రమే మీ ఫోన్ ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. వేరే చార్జర్ తో కానీ లోకల్ చార్జర్ తో కానీ ఫోన్ చార్జ్ పెడితే పాడవుతుంది. అందుకే వేరే ఏ అడాప్టర్ ని కూడా పెట్టద్దు. బ్యాటరీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. దాని కేబుల్ తో మాత్రమే ఫోన్ ని చార్జింగ్ పెట్టుకోవాలి.

మీ ఫోన్ కవర్ని వేరు చేసి ఆ తర్వాత చార్జ్ పెట్టండి. స్మార్ట్ ఫోన్ ని ఛార్జ్ చేసేటప్పుడు వేడెక్కుతుంది. ప్రొటెక్షన్ కవర్ కారణంగా హీట్ బయటకి రాదు దాంతో ఫోన్ పాడే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కి ఫాస్ట్ చార్జర్ ని ఎంపిక చేసుకోవడం కూడా పొరపాటు ఈ తప్పు కూడా చేయకండి. రాత్రంతా చార్జింగ్ లో పెట్టి ఫోన్ ని వదిలేస్తే కూడా బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది ఫోన్ పాడయ్యే అవకాశముంది పేలే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news