సిగ్గున్న వారు ఎవరైనా జనసేనలో చేరుతారా ? : కే ఏ పాల్

-

దైవసేవకుడిగా పేరున్న కే ఏ పాల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రజాశాంతి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలకు ఉత్తమమైన పాలనను అందించడానికి కృషిచేస్తున్నాడు. తాజాగా ఈయన రాజమండ్రి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జనసేన పార్టీపైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. నేను ముందు నుండి చెబుతున్నాను , ప్రజల కోసం ఏ పార్టీలు ఉన్నాయి , ప్రజలను మోసం చేయడానికి ఏ పార్టీలు ఉన్నాయని … ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తుంటే మీకే అర్ధమవుతుంది అంటూ కే ఏ పాల్ కామెంట్ చేశారు. అస్సలు పవన్ స్థాపించిన జనసేన పార్టీలో సిగ్గున్న ఏ నాయకుడు ? లేదా కార్యకర్త అయినా చేరుతారా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు కే ఏ పాల్. ఇంకా పాల్ మాట్లాడుతూ ఈ విషయంపైన చిరంజీవి, నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ లతో ఓపెన్ గా డెబిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సవాలు విసిరాడు.

పార్టీ మొదలు నుండి పవన్ కు మద్దతుగా ఉన్న ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మి నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, లాంటి మేధావులు అంతా కూడా యాంకర్ లుగా మిగిలిపోతారని వారిని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news