వంగవీటి.. నో క్లారిటీ?

-

ఏపీ రాజకీయాల్లో గెలుపుతో సంబంధం లేకుండా కాపు వర్గంలో బాగా ఫాలోయింగ్ నాయకుడు వంగవీటి రాధా..తన తండ్రి వంగవీటి రంగా కాపు వర్గానికి ఎనలేని కృషి చేశారు. ఇక రంగా వారసత్వాన్ని కొనసాగిస్తూ రాధా..కాపు వర్గమే కాదు…పేద వర్గాలకు అండగా ఉంటూ..రంగా ఆశయాలని ముందుకు తీసుకెళుతున్నారు. అయితే రాజకీయంగా మాత్రం రాధా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన భవిష్యత్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇక అంతా సెట్ అవుతుందనుకునే లోపు ఆయన పార్టీ మారుతూ రావడం మైనస్ అవుతుంది.

తాజాగా అలాంటి ప్రయత్నమే మళ్ళీ చేస్తున్నారని ప్రచారం వచ్చింది. ఆయనకు జనసేన నుంచి ఆహ్వానం వచ్చిందని, ఇక అభిమానులు, అనుచరులతో సమావేశం పెట్టుకుని పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇస్తారని తెలిసింది. కానీ చివరి నిమిషంలో అనుచరులతో సమావేశం రద్దు అయినట్లు తెలిసింది. దీంతో రాధా పోలిటికల్‌గా ఎలాంటి స్టెప్ తీసుకుంటారో మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే రంగా వారసుడుగా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చి..2004లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక 2009లో వైఎస్సార్ బ్రతిమాలిన వినకుండా చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ రాధా వైసీపీ వైపుకు వెళ్లారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక వైసీపీ అధికారంలో లేకపోయినా ఐదేళ్ల పాటు అదే పార్టీలో కొనసాగారు. కానీ వైసీపీలో ఉంటే కనీసం తన తండ్రి విగ్రహానికి నివాళి అర్పించడానికి కూడా జగన్ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి..ఆయన ఆవేశంతో వైసీపీని వీడారు.

2019 ఎన్నికల ముందు టి‌డి‌పిలో చేరారు. అప్పుడు టి‌డి‌పిలో పోటీ చేయకుండా ప్రచారం చేశారు. టి‌డి‌పి ఓడిపోయింది. తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు టి‌డి‌పికి మద్ధతు ఇస్తూ వచ్చారు. అమరావతికి మద్ధతుగా నిలిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు జనసేనలో చేరాలని అభిమానుల ఒత్తిడి పెరిగిందని తెలిసింది..దీంతో వారితో సమావేశం అవ్వాలని చూశారు. కానీ సమావేశం రద్దు అయినట్లు తెలిసింది.

దీంతో రాధా టి‌డి‌పిని వీడి జనసేనలో చేరతారా? అసలు టి‌డి‌పిలో ఉంటే ఎక్కడ పోటీ చేస్తారు? టి‌డి‌పి-జనసేన పొత్తు ఫిక్స్ అయితే రాధా సీటు ఏంటి అనేది క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news