లోక్‌సభలో కేసీఆర్‌ను దూషించిన బండి సంజయ్‌.. కేటీఆర్‌ ఆగ్రహం

-

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలకు ఫలితం వచ్చిందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు యుద్ధప్రాతిపదికన పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​పై కేటీఆర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. సీఎం కేసీఆర్‌ను లోక్‌సభలో బండి సంజయ్ దూషించారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని ఇంటి పేరు అవమానించారని కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కేసీఆర్‌ను దూషించిన బండి సంజయ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏం చేస్తారు..? మా సీఎం గురించి అసభ్యంగా మాట్లాడిన మేం ఏం చేయాలని’’ అని ఎక్స్(ట్విటర్) వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

అవినీతి యూపీఏ.. ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిందని లోక్​సభలో బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రైతుల ఆదాయం పెరగలేదు కానీ.. ముఖ్యమంత్రి కుటుంబం ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news