ఎట్టకేలకు ఒప్పించిన బోర్డు: బంగ్లాదేశ్ వన్ డే కెప్టెన్ గా షకిబుల్ హాసన్

-

బంగ్లాదేశ్ వన్ డే కెప్టెన్ గా ఉన్న తమీమ్ ఇక్బల్ ఆగష్టు మూడవ తేదీన నేను కేవలం ప్లేయర్ గా కొనసాగుతాను తప్ప .. కెప్టెన్ గా చేయలేను అని చెప్పడంతో, ఆందోళనలో పడిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాన్ని వెతకడం మొదలు పెట్టింది. అందులో భాగంగా గతంలో కెప్టెన్సీ చేసిన ఆల్ రౌండర్ షకిబుల్ హాసన్ ను వన్ డే కెప్టెన్ గా చేయడానికి నిర్ణయించుకుంది. కానీ ఇందుకు షకిబుల్ హాసన్ ఒప్పుకోకుండా సమయాన్ని నెడుతూ ఉండడంతో, దూకుడు పెంచిన బోర్డు చైర్మన్ నజముల్ హుస్సేన్ షకీబ్ తో మాట్లాడి ఎట్టకేలకు రానున్న ఆసియా కప్ , వన్ డే వరల్డ్ కప్ మరియు న్యూజిలాండ్ తో జరుగనున్న వన్ డే సిరీస్ కు కెప్టెన్ గా చేయడానికి ఒప్పించారు.

ఆ తర్వాత ఎంతకాలం షకీబ్ అందుబాటులో ఉంటాడన్నది తెలియాల్సి ఉంది. ఇక లంక ప్రీమియర్ లీగ్ తో బిజీ గా ఉండగా వచ్చాక పర్సనల్ గా మాట్లాడుతామని బోర్డు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news