నేటి తరుణంలో విద్యార్థి దశలో అనేక మంది కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. దీన్ని నివారించేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారులకు ప్రభుత్వ వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 3,89,162 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేపట్టాలని కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 3,66,094 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేశారు.
ఇంకా 23,068 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. నవంబరు 1వ తేదీనుంచి డిసెంబరు ఆఖరు వరకు ఎపీలోని అన్ని జిల్లాల్లో రెండో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోందని మిగిలిన చిన్నారులకుకూడా కంటి పరీక్షలు చేయాలని వైద్యాధికారులు కార్యాచరణ రూపొందించారు.