భాగ్యనగరానికి తరలివస్తున్న డబ్ల్యూడబ్ల్యూఈ

-

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ-) పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. మనదేశంలోనూ ఈ పోటీలకు పెద్ద క్రేజ్ ఉంది. తాజాగా తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఇది పెద్ద గుడ్‌న్యూసే. అది ఏంటంటే.. సెప్టెంబర్ 8న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాదులో నిర్వహించే ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ పేరు సూపర్ స్టార్ స్పెక్టాకిల్-2023 అని శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్ లో వెల్లడించారు. సెప్టెంబరు 8న గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుందని తెలిపారు.

In a first, Hyderabad to host WWE event-Telangana Today

డబ్ల్యూడబ్ల్యూఈ పురుషుల వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ సేత్ ఫ్రాంక్లిన్ రోలిన్స్, మహిళల వరల్డ్ చాంపియన్ రియా రిప్లేతో పాటు డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ చాంపియన్స్ సమీ జేన్, కెవిన్ ఓవెన్స్… ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్ ది రింగ్ జనరల్ గుంతర్, జిందర్ మహల్, వీర్, సంగా, డ్రూ మెకింటైర్, బెకీ లించ్, నటాల్యా, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ తదితర డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్లు హైదరాబాదుకు రానున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news