ప్రభుత్వ మల్టీ పర్పస్ హైస్కూలులో ఆరోగ్యశాఖ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కండ్ల కలక నివారణ మందుతోపాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే స్వర్ణప్రాషన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఆయుష్ కమీషనర్ హరి చందన, హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..స్వర్ణప్రాషన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుందని..గతంలో ఈ డ్రాప్స్ ని పిల్లలందరికీ క్రమం తప్పకుండా ఇచ్చేవారని వెల్లడించారు.
ఈ కార్యక్రమం కోసం స్వర్ణప్రాషన్ తయారు చేసేందుకు ముందుకు వచ్చిన హరే కృష్ణ హరే రామ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కోటి 10 లక్షల రూపాయల స్వర్ణప్రాషన్ తయారుచేసి ఉచితంగా పంచేందుకు ముందుకు వచ్చిన హరే కృష్ణ హరే రామ సంస్థ వారికి ధన్యవాదాలు చెప్పారు. ఈ డ్రాప్స్ 10 నెలలు వాడడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఎంతగానో ఆరోగ్యవంతంగా తయారవుతారని.. బంగారం ఉపయోగించి తయారు చేసే ఈ ఆయుర్వేద డ్రాప్స్ ని 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తీసుకోవచ్చని వివరించారు. అదే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కండ్ల కలక రాకుండా కాపాడుకోవచ్చని.. కండ్ల కలక గాలిలో కానీ వేరే విధంగా కానీ రాదు అది ముట్టుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. వాటికి సంబంధించిన అన్ని ఆయింట్మెంట్స్, డ్రాప్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని పేర్కొన్నారు.