రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంగళవారం మధిర క్యాంప్ ఆఫీసులో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ సంపద రాష్ట్ర ప్రజలకే చెందాలి.. నాయకులకు కాదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు బీఆర్ఎస్ వేసే గాలం నుండి తప్పించుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చిన ఈ పది సంవత్సరాలలో రాష్ట్రంలో ఏమీ సాధించలేదన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్ల అప్పు తెచ్చిందన్నారు. తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వల్లే రాష్ట్రంలో ఇళ్లు, పెన్షన్లు, దళిత బంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నుండి చుక్కనీరు కూడా అదనంగా అందడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్ని సబ్సిడీలను ఎత్తివేసిందన్నారు.