రేగా వర్సెస్ పాయం..పినపాకలో పైచేయి ఎవరిది?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం..నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బూర్గంపాడు నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట గతంలో సి‌పి‌ఐ పలుమార్లు గెలిచింది. అలాగే కాంగ్రెస్ సైతం మధ్యలో కొన్ని సార్లు గెలిచింది. 1999 ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి టి‌డి‌పి గెలిచింది. 2004లో మళ్ళీ సి‌పి‌ఐ గెలిచింది. సి‌పి‌ఐ నుంచి పాయం వెంకటేశ్వర్లు గెలిచారు.

2008లో నియోజకవర్గాల  పునర్విభజన జరగగా, అప్పుడు పినపాకగా ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు విజయం సాధించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ వైసీపీ హవా నడిచింది. వైసీపీ నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీ చేసి గెలిచారు. ఈయన తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. 2018 ఎన్నికల్లో పాయం బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగితే, రేగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్‌కు టి‌డి‌పి, కమ్యూనిస్టుల మద్ధతు ఉంది. దీంతో రేగా విజయం సాధించారు.

ఇక ఈయన కాంగ్రెస్ నుంచి బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. అప్పటినుంచి బి‌ఆర్‌ఎస్ లో రేగా, పాయంలకు పడేది కాదు. పైగా ఎమ్మెల్యేగా ఉండటంతో రేగా హవా నడిచేది. అయితే అనుకున్న మేర ఎమ్మెల్యగా గొప్ప పనితీరు కనబర్చడంలో రేగా విఫలమవుతున్నారు. ఆయనపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పాయం..బి‌ఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చి..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు.

వచ్చే ఎన్నికల్లో రేగా బి‌ఆర్‌ఎస్ నుంచి, పాయం కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక పాయంకు పొంగులేటి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అయితే కమ్యూనిస్టుల మద్ధతు ఇక్కడ కీలకం వారు బి‌ఆర్‌ఎస్‌కు సపోర్ట్ గా ఉన్నారు. అలా కాకుండా కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలుతాయి. అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పలేం. మొత్తానికైతే రేగా, పాయం మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news