అనంతగిరి అడవుల్లో రేజింగ్ స్పందించిన పోలీసులు

-

అనంతగిరి అడవుల్లో రేసింగ్ పై పోలీసులు తాజాగా స్పందించారు. ముఖ్యంగా రేసింగ్ నిర్వహించిన వారిలో కొందరిని గుర్తించినట్టు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా మిగిలిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు స్వాతంత్య్ర దినోత్సవం బందోబస్తులో ఉన్న సమయంలో రేసింగ్ కి పాల్పడ్డారని.. ఇకపై ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎస్పీ.

అనంతగిరి అడవుల్లో జరిగిన కారు, బైక్ రేసింగ్ విన్యాసాలకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లి అటవీ శాఖ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వివరాలను సేకరించారు. అందులో ఒక కారు నెంబర్ ను గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఇద్దరూ ఆర్గనైజర్లు, 40 మందితో 16 కార్లు, రేసింగ్ బైకులు తీసుకొచ్చి విన్యాసాలను నిర్వహించినట్టు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. అసలు వీరిని అనంతగిరి అడవుల్లోకి ఎవ్వరూ తీసుకొచ్చారు ? వీరికి సహకరించింది ఎవరు ? అనే విషయాలపై విచారణ చేపడుతున్నట్టు వెల్లడించారు. రేసింగ్ లో పాల్గొనటువంటి వాహనాలను నెంబర్లను ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news