గుండె పోటు.. ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది దీనికి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. తాజాగా హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ – వరుస గుండెపోటు మరణాలు భయాందోళన కల్గిస్తున్నాయి. ఈరోజు ఉప్పల్ పరిధి రామంతాపూర్లోని ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46) గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు.