ఈ గవర్నమెంట్‌ స్కీమ్‌లో జాయిన్‌ అయితే కోటీ రూపాయలు పొందొచ్చు

-

డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అలాగే డబ్బును పొదుపు చేయడానికి కూడా చాలా దారులు ఉన్నాయి. మీరు వీటిల్లో ఏది ఎంచుకుంటున్నారో అదే ముఖ్యం. అదే మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది. రిస్క్‌ లేకుండా కోటి రూపాయలు పొందే స్కీమ్‌ ఒకటి ఉంది. ఈ ప్రభుత్వ స్కీమ్‌లో జాయిన్‌ అయి మీ డబ్బును ఇన్వస్ట్‌ చేశారంటే.. ఈజీగా డబ్బు డబల్‌ అవుతుంది.

భారత ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అందిస్తోంది. దీన్ని మనం పీపీఎఫ్ అని కూడా పిలుస్తాం. ఇందుల చేరితే మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. ప్రతి నెలా మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీరే వచ్చే రాబడి కూడా మారుతుంది. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. పెట్టిన డబ్బులు, వచ్చిన రాబడి, విత్‌డ్రా మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు ఉంది. చాలా కాలం నుంచి ఇదే వడ్డీ రేటు కొనసాగుతూ వస్తోంది.

ప్రభుత్వం వడ్డీ రేటును పెంచడం లేదు. ఇతర స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ వడ్డీ రేటు ప్రకారం.. మీరు పీపీఎఫ్‌లో రూ.కోటి పొందాలని భావిస్తే నెలకు రూ. 12,500 డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా మీరు 25 ఏళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి. సాధారణంగా పీపీఎఫ్ టెన్యూర్ 15 ఏళ్లు ఉంటుంది. అయితే మీరు ఐదేళ్ల చొప్పున టెన్యూర్ పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. అదే మీరు నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 25 ఏళ్ల తర్వాత చేతికి రూ. 8.17 లక్షలు వస్తాయి. ఇక రూ. 2 వేలు పెడితే రూ. 16.35 లక్షలు, రూ. 3 వేలు పెడితే రూ. 24.52 లక్షలు, రూ. 5 వేలు పెడితే రూ. 44.88 లక్షలు, రూ.10 వేలు పెడితే రూ. 81.76 లక్షలు సొంతం చేసుకోవచ్చు. కాగా ఈ స్కీమ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news