వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్జీ ప్రసవం..!

-

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె ఏదో కార్పోరేట్ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోలేదు. వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలోనే ప్రసవించారు. ఈ కాన్పులో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్ కి చెందిన జడ్జీ జస్టిస్ జ్యోతిర్మయి ఈ మధ్యకాలంలో వేములవాడకు బదిలీ అయ్యారు. ఆమె గర్భవతిగా ఉన్నా విధులకు హాజరయ్యారు. 

ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంటనే ఆమె ఏరియా ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ చైతన్య సుధా జడ్జీకి నార్మల్ డెలివరీ చేశారు. డెలివరీ తరువాతమాట్లాడిన వైద్యురాలు చైత్యసుధా.. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. జస్టీస్ జ్యోతిర్మయికి ఇది ఫస్ట్ కాన్పు అని.. సాధారణ ప్రసవమే జరిగిందని చెప్పుకొచ్చారు. ఫస్ట్ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి తమ ఆసుపత్రి తరుపున ఊయల బహుమతి ఇస్తాన్నామని జస్టిస్ జ్యోతిర్మయికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు తెలిపారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి జడ్జీ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news