లోకేష్ పాదయాత్ర..బెజవాడ తమ్ముళ్ళ లొల్లి..ఎవరికి వారే!

-

మరో రెండు రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఎంట్రీ కానుంది. ఈ నెల 19న విజయవాడ నగరంలో లోకేష్ పాదయాత్ర మొదలువుతుంది. మొదట విజయవాడ వెస్ట్, తర్వాత సెంట్రల్, ఈస్ట్, పెనమలూరులో కొనసాగి..21న గన్నవరంలో పాదయాత్ర, సభ జరగనున్నాయి. అయితే ఇప్పటివరకు లోకేష్ పాదయాత్ర ప్రతి జిల్లాలో కనీసం పది రోజులపైనే జరుగుతూ వచ్చింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక సభ జరిగింది.

కానీ కృష్ణాలో మాత్రం మూడు రోజుల పాదయాత్ర, ఒక సభ మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనికి కారణం టి‌డి‌పిలో నేతల్లో సఖ్యత లేకపోవడం, రూట్ మ్యాప్ విషయంలో కొందరు నేతలే పెత్తనం చేయడంతో పాదయాత్ర తక్కువ రోజులు జరుగుతుందని తెలిసింది. అయితే మొదట నుంచి బెజవాడలో టి‌డి‌పి నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు పడదు. అటు బోండా ఉమాకు, కేశినేనికి పొసగదు. దేవినేని ఉమాతో కొందరు నేతలకు పడదు. ఇదే సమయంలో కేశినేని సోదరుడు చిన్ని ఎంట్రీ ఇచ్చి..విజయవాడ ఎంపీ సీటుపై గురి పెట్టారు. అక్కడే పనులు చేస్తున్నారు.

పైగా ఎంపీ అయిన కేశినేనికి కాకుండా..పాదయాత్ర నిర్వహణ బాధ్యత చిన్నికి అప్పగించారు. దీంతో లోకేష్ పాదయాత్రలో నాని పాల్గొనడం డౌటే అని తెలుస్తోంది. అయితే నాని..విజయవాడ వెస్ట్ సమన్వయకర్తగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన రావాలి. ఒకవేళ రాలేదంటే ఇంకా ఆయన టి‌డి‌పికి దూరం జరిగినట్లే.

వాస్తవానికి కృష్ణాలో ఇంకా పామర్రు, గుడివాడ, అవనిగడ్డ లాంటి నియోజకవర్గాలని కవర్ చేయలంట…కానీ తమ్ముళ్ళ మధ్య రచ్చ వల్ల పాదయాత్ర కుదించారు. ఈ పరిస్తితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కృష్ణాలో టి‌డి‌పి మళ్ళీ ఘోరంగా ఓడిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news