చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా పంపిన లూనా 25 కూలిపోవడంతో అందరీ దృష్టి చంద్రయాన్ 3పైనే ఉంది. కొన్ని గంటల్లో..విక్రమ్ ల్యాండర్ జాబిల్లిగా అడుగుపెట్టబోతుంది. సురక్షితంగా జాబిల్లిపై దిగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రయాన్ 2 ఫెయిల్ అయినా..ఇస్రో ధీమా వెనక ఉన్న కారణాలు ఏంటి.. రష్యా లూనా 25 కి చంద్రయాన్ 3 కి మధ్య తేడాలు ఏమున్నాయి. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చంద్రయాన్ 3 ప్రయోగం ల్యాండింగ్‌పై ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే ఆదివారం రష్యాకు చెందిన లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై దిగే క్రమంలో క్రాష్ అయినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ తెలిపింది. దీంతో చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్‌పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. అయినా ఇస్రో మాత్రం విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై సేఫ్‌గా ల్యాండ్ అవుతుంది పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తుంది.. దీనికి కారణాలు ఏంటంటే..
చంద్రుడిపై కాలు మోపేందుకు చంద్రయాన్ 2 ప్రయోగం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషంలో అది చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో ఆ ప్రయోగం అర్థాంతరంగా ఆగిపోయింది. కానీ కూలిపోకముందు చంద్రయాన్ 2.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించి చాలా ఫోటోలను, సమాచారాన్ని ఇస్రోకు అందించింది. ఈ నేపథ్యంలోనే వాటన్నింటినీ విశ్లేషించిన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 లో తలెత్తిన లోపాలను సవరించి మరింత అడ్వాన్స్డ్గా చంద్రయాన్ 3 ని ప్రయోగించారు. అందరూ చంద్రయాన్ 2 ఫెయిల్ అని ప్రాజెక్ట్ అనుకుంటారు. అది పూర్తిగా ఫెయిల్ అవలేదు. చంద్రయాన్ 2 ప్రయోగంలో ఇచ్చిన ఫోటోల ఆధారంగానే.. చంద్రయాన్ 3 ని మరింత అడ్వాన్స్డగా తీర్చిదిద్దారు.
రాళ్లు, గుంటలతోపాటు జాబిల్లి ఉపరితలంపై ఖాళీ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఫోటోలు చంద్రయాన్ 2 తీసి పంపింది. ఎక్కడ దిగితే సేఫ్ ల్యాండింగ్ అవుతున్న సమాచారాన్ని కూడా ఇస్రో సేకరించింది. ఈ సమాచారం మొత్తాన్ని చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ మెమొరీలో ఉంచారు. అయితే చంద్రుడిపై ల్యాండింగ్ జరిగే సమయంలో ఈ సమాచారాన్ని మొత్తం విశ్లేషించి విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కానుంది. ల్యాండింగ్ సమయంలో ఏవైనా గుంటలు గానీ రాళ్లు గానీ ఉంటే విక్రమ్ ల్యాండర్ దానంతట అదే సురక్షిత ప్రాంతంలో దిగనుంది. ఇదే లూనా 25కి చంద్రయాన్ 3కి మధ్య ఉన్న తేడా.. ఎందుకంటే డీ బూస్టింగ్ ప్రక్రియలు నిర్వహించిన తర్వాత విక్రమ్ ల్యాండర్ పూర్తిగా దానంతట అదే చంద్రుడి చుట్టూ తిరుగుతుంది.
దీనికి తోడు చంద్రయాన్ 2 ప్రయోగాన్ని సక్సెస్ ఆధారిత మోడల్ రూపంలో ప్రయోగించారు. అయితే ఈసారి చంద్రయాన్ 3 లో ఫెయిల్యూర్ ఆధారిత మోడల్లో ప్రయోగించినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీంతో చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో భావిస్తోంది.