ఏపీ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని  పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పధాన అధికారులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆందోళన కరంగా ఉందన్నారు. నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఈ మరణాలను హత్యలుగానే చేస్తున్నట్లుగానే భావించాలి.

అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం కృంగిపోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో ఏడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఎప్పుడు మీడియాకి దూరంగా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన ఈరోజు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అన్నారు. ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేసిన పరిస్థితి నెలకొందన్నారు. గ్రామపంచాయతీలకు సంబంధించిన  నిధులను దారి తప్పించారని, చిన్న చిన్న కాంట్రాక్టర్లుకు చెల్లించవలసిన బకాయిలు ఇవ్వలేదని పేర్కొన్నారు పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరీ మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

Read more RELATED
Recommended to you

Latest news