అమరావతి: గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జీగా యార్లగడ్డ వెంకట్రావుని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావుని గెలిపించి పసుపు జెండా ఎగరేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. యార్లగడ్డతో పాటు తెలుగుదేశంలో చేరేందుకు వచ్చిన వారందరికీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు లోకేష్.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కూడా సరిగా చేయలేని ప్రిజనరీకి, ముందు చూపుతో విద్యుత్ సమస్యలు పరీష్కరించిన విజనరీకి ఇదే తేడా అంటూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గన్నవరంలో పిల్లసైకో వంశీని రాజకీయాల నుంచి శాశ్వతంగా బాహీష్కరించేందుకు అంతా కలసికట్టుగా పని చేయాలన్నారు. గన్నవరంలో ప్రతీ తెలుగుదేశం కార్యకర్తను కాపాడుకునే బాధ్యత లోకేష్ తీసుకుంటాడన్నారు.
తన గెలుపు కోసం కష్టపడిన తెలుగుదేశం శ్రేణులపైనే తప్పుడు కేసులు పెట్టించి మరీ వేధిస్తున్న పిల్ల సైకో వంశీ అని దుయ్యబట్టారు. పార్టీ మారే ముందు కూడా పట్టిసీమ లేకుంటే గన్నవరంలో బాత్రూమ్ కడిగేందుకు కూడా నీళ్లు ఉండేవి కాదంటూ వంశీ ఎంతో నటించాడని తీవ్ర విమర్శలు చేశారు.