ఆర్టీసీ విభజన జరగలేదు, మనమింకా ఏపీ ఎస్ఆర్టీసీలోనే ఉన్నాం: అశ్వత్థామరెడ్డి

-

తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ నివాసంలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కోదండరాం తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట విభజన జరిగినా ఏపీఎస్ఆర్టీసీ విభజన జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లదని స్పష్టం చేశారు. ఆర్టీసీని కేంద్రం పంపకాలు చేయాల్సి ఉందన్నారు. ఇంకా తామంతా ఏపీఎస్ఆర్టీసీలోనే కొనసాగుతున్నామని చెప్పారు.

సమ్మె యథాతధంగా కొనసాగుతుందని.. కార్మికులు ఎవరూ భయపడాల్సిన అసరం లేదన్నారు అశ్వధ్దామరెడ్డి. ఈ నెల 4 లేదా 5న ఢిల్లీ వెళ్లి ఆర్టీసీ వ్యవహారంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి తోడ్పడాలంటూ కేంద్రాన్ని కోరతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె నేటితో 29వ రోజుకు చేరుకుంది. ఇక సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news