ప‌వ‌న్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌…. జ‌న‌సేన‌కు మ‌రో కీల‌క నేత దూరం..!

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన  పార్టీకిమ‌రో ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌నుందా?  కీల‌క నాయ‌కు డు, మాజీ మంత్రి ప‌సుపులేటి బాల‌రాజు రేపో మాపో పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? అంటే.. తాజా ప‌రిణా మాలు ఔన‌నే అంటున్నాయి. కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయ‌న ప‌వ‌న్ వైఖ‌రిపై గుస్సాగా ఉ న్నారు. పార్టీకి ఒక ద‌శ, దిశను ఏర్పాటు చేయ‌డంలో ప‌వ‌న్ విఫ‌ల‌మ‌య్యారంటూ.. బాల‌రాజు కొన్నాళ్ల కిం దట త‌న అనుచ‌రుల వ‌ద్ద వ్యాఖ్యానించారు. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తు న్నారు. దీంతో ఆయ‌న గురించిపార్టీలో పెద్ద‌గా ప్ర‌స్థావ‌న కూడా లేకుండా పోతోంది.

తాజాగా బాల‌రాజు పార్టీ మార‌తారంటూ ప్ర‌దాన మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఎస్సీ, ఎస్టీవ ర్గాల‌కు వైసీపీ బాగా చేరువైంది. నాటి వైఎస్ ఆశ‌యాల మేర‌కు ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల ను ప్ర‌వేశ పెట్ట‌డంతోపాటు ఆరోగ్య శ్రీని కూడా మ‌రింత‌గా చేరువ చేసింది. దీంతో గిరిజ‌నులు, ఎస్సీ వర్గా లు వైసీపీకి చేరువ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే కీల‌క నేత‌లు వ‌రుసగా వైసీపీలో చేరిపోయేందుకు ప‌క్కా వ్యూ హం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

ఆదివారం విశాఖపట్నంలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నారు. దానికి ఒకరోజు ముందు.. శనివారం బాలరాజు పార్టీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల అనంతరం బాలరాజు జనసేనకు దూరంగా వుంటూ వచ్చారు. రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరతారనేది స్పష్టం కాలేదు. వైసీపీలో చేరనున్నారని ఆయన సన్నిహితులు చెబుతు న్నారు. గ‌తంలో గిరిజ‌న నాయ‌కుడిగా ఎదిగిన బాల‌రాజు కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయ‌కుడిగా కూడా చ‌క్రం తిప్పారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ హ‌యాంలో ఆయ‌న గిరిజ‌న సంక్షేమ మంత్రిగా ఉన్నారు.

కాంగ్రెస్ ప‌ట్ల ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ఉన్న బాల‌రాజు.. వివాద ర‌హితుడిగా, ఎస్టీ వ‌ర్గానికి ఎంతో చేరువైన నాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయ‌కుడికి జ‌న‌సేన‌లో ఆశించిన మేర‌కు గుర్తింపు రాలేద‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ను విడిచి పెట్టేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు. మ‌రి వ్య‌వ‌హార శైలిపై ఇప్ప‌టికే సీనియ‌ర్ల‌లోనూ ఇలాంటి ఆలోచ‌నే ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న త‌న పంథాను మార్చుకుంటారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news