కృష్ణామోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్ కి తప్పుడు వివరాలను సమర్పించారని వేటు వేసింది. సరైన వివరాలను అందించలేదని హైకోర్టు వెలువరించిన తీర్పులో అనర్హత వేటు వేసింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణగా ప్రకటించింది.
మూడు లక్షల వరకు జరిమానా విధించింది. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించింది తెలంగాణ హై కోర్టు. జరిమానా విధించిన రూ.3లక్షల్లో డీకే అరుణకు రూ.50వేలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల కమిషన్ కి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని అనర్హత వేటు వేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొంటున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ లో కృష్ణామోహన్ రెడ్డి పేరు ఉండటం గమనార్హం. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? లేక వేరే అభ్యర్థికి టికెట్ కేటాయిస్తారా అనేది క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.