ప్రపంచ చెస్‌కప్ లో ప్రజ్ఞానందకు నిరాశ…

-

ప్రతిష్ఠాత్మక చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత కుర్రాడు ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. వరల్డ్‌ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలన్న అతని కల నెరవేరలేదు. గురువారం జరిగిన టై బ్రేకర్‌ పోరులో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. తొలిరౌండ్‌ తొలిగేమ్‌లో ప్రజ్ఞానందపై కార్ల్‌సన్‌ విజయం సాధించగా.. రెండో గేమ్‌ డ్రాగా ముగిసింది. దీంతో ప్రజ్ఞానందకు ఓటమి తప్పలేదు. అయితే ఫైనల్‌లో ఓడిపోయినా అందరి మనసులు గెల్చుకున్నాడీ భారత కుర్రాడు..

Chess World Cup Final: अगर टाई ब्रेकर भी ड्रॉ रहा तो क्या होगा, प्रज्ञानंदा  और कार्लसन में कौन बनेगा वर्ल्ड चैंपियन - chess world cup final pragyanand  vs carlsen magnus will decide

ఇప్పటికే ఐదు పర్యాయాలు వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ టైటిళ్లు సాధించిన 30 ఏళ్ల నార్వే గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ కు కెరీర్ లో ఇదే తొలి ఫిడే వరల్డ్ కప్ టైటిల్. అటు, గతంలో పలుమార్లు కార్ల్ సన్ ను ఆన్ లైన్ చెస్ లో ఓడించిన ప్రజ్ఞానంద… ప్రపంచకప్ సమరంలో ముఖాముఖి పోరులో ఓడించిలేకపోయాడు. తద్వారా, వరల్డ్ కప్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news