నేను సుప్రీంకోర్టుకు వెళ్తా : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

-

తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వరుస షాకులు తగులుతున్నాయి. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫడవిట్ దాఖలు చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన తరువాతి స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు.

Election of Gadwala MLA invalid: High Court | Telangana HC Disqualified  Gadwal MLA Bandla Krishna Mohan

అయితే.. తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసులో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేయడంతో పాటు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ…. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానన్నారు. తాను 2014లో చూపించిన ప్రాపర్టీని 2018లో అమ్మివేశానని, ఆ కారణంగా ఆ తర్వాత ఎన్నికల అఫిడవిట్లో దానిని పేర్కొనలేదన్నారు. విక్రయించిన ప్రాపర్టీని అఫిడవిట్‌లో ఎలా చూపిస్తానన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news