టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే జన తాకిడి ఎక్కువగా ఉండటంతో లోకేష్ చేతికి పలు చోట్ల గాయాలు అయ్యాయి. వేళ్లకు బొబ్బలెక్కటంతో ఇబ్బంది పడుతున్నారు లోకేష్. రోడ్డు పైనే పస్ట్ ఎయిడ్ చేశారు ఆయన సహాయక సిబ్బంది. ఓ వైపు గాయం బాధిస్తున్నా పాదయాత్రను కొనసాగిస్తున్నారు లోకే ష్.
లోకేశ్ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆధునిక మామిడి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో కొత్త మామిడి రకాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇతర దేశాలకు కావాల్సిన మామిడి రకాలు మన వద్దే పెంచే అవకాశం ఉందని లోకేశ్ తెలిపారు. తాము వచ్చాక మామిడి రైతులకు తోడ్పాటు అందించేలా పల్పింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నూజివీడులోని మామిడి పరిశోధన కేంద్రాన్ని బలోపేతం చేస్తామని, మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. మామిడి అమ్మకానికి మార్కెట్ ను లింక్ చేస్తామని, పెద్ద సంస్థలతో ఒప్పందం చేసుకుని రైతుకు లబ్ది చేకూరేలా చూస్తామని లోకేశ్ వివరించారు. మామిడి బోర్డు ఏర్పాటుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.