చంద్రుడిపై 8 మీటర్లు ప్రయాణించిన ప్రగ్యాన్ రోవర్

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది అందజేస్తున్నది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్ కదలికలను ధృవీకరించబడ్డాయని ఇస్రో ప్రకటించింది. రోవర్ దాదాపు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని ట్వీట్ చేసింది. ప్రస్తుతం రోవర్ పేలోడ్ లు, ఎల్ఐబిప్ఎస్ ,ఏప్ ఎక్స్ లను ఆన్ చేసినట్లు ఇస్రో తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్ లోని అన్ని పేలోడ్ లు పనిచేస్తున్నాయని వెల్లడించింది.

Chandrayaan-3: Pragyan rover, not Vikram lander, is the dark horse of  ISRO's giant leap towards Moon

మరోవైపు చంద్రుడిపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రజ్ఞాన్ రోవర్‌ బయటకు వచ్చేందుకు 26 యంత్రాంగాలు సహాయపడినట్లు ఇస్రో తెలిపింది. అలాగే విద్యుత్‌ ఉత్పత్తి చేసి రోవర్‌కు శక్తిని ఇచ్చే సోలార్ ప్యానల్ అత్యంత కీలకమైనదని పేర్కొంది. కాగా, చంద్రయాన్‌-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్‌పై అన్ని దేశాలు దృష్టిసారించాయి. దీంతో చంద్రుడి నేలపై ప్రయాణం ప్రారంభించిన రోవర్‌ ప్రజ్ఞాన్ పంపనున్న ఫోటోలు, అది అందించే సమాచారం గురించి సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news