వంట చేయడం కంటే యుద్ధానికి వెళ్లడం మేలంటున్న యువత..! సర్వేలో తేలిన విషయం

-

ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు తింటారు.. కానీ వండేది మాత్రం ఒక్కరే. మళ్లీ ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్‌ ఉంటుంది. వాళ్లకు నచ్చినట్లు చేయాలి. తినడానికి సై అంటారు.. వంటలో ఒక చేయి వేసి హెల్ప్‌ చేయమంటే సెసేమీరా అంటారు. అసలు వంట చేయడం అంటే ఎంత మందికి ఇష్ట ఉంటుంది అనే దానిపై అమెరికాలో సర్వే చేశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

వందమందిలో 30 మంది వంట చేయడం కన్నా యుద్దానికి వెళ్లడమే సులువు అని ఒప్పుకున్నారట. వంట చేయడం వల్ల చాలా అలసిపోతామని, రోజూ వండడం చాలా బోరింగ్ విషయమని చాలామంది అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో కూడా 29 శాతం మంది వంట చేయడం ఇష్టం లేదని ఒప్పుకున్నారు. రోజూ వంట చేసే వారిలో ఎంతోమంది తమ ఇంట్లోని ఇతరులను ఒక్కరోజైనా వంట చేయమని అడుగుతూ ఉంటారట. దానికి కారణం రోజూ వంట చేస్తే బోరింగ్‌గా ఉంటుందని, తమ వంట తామే తినడం ఇంకా బోరింగ్‌గా ఉందని వారు చెబుతున్నారు.

వంట చేయడం కష్టంగా అనిపించే రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఆహారాలను అధికంగా కొని తినేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచంలో 42 శాతం మంది వంటగదిలోకి వెళ్లడంతోనే అలసటగా ఫీల్ అవుతారట. ఎంతోమందికి పాస్తా, సుషీ, నూడుల్స్ వంటివి ఇష్టంగా తింటారు. వాటిని తయారు చేసుకోవడానికి కూడా వారికి ఓపిక ఉండదు. ఆ భయానికి కారణం వంట బోరింగ్‌గా అనిపించడమేనని వివరిస్తున్నారు.

వంట చేయడం అనేది ఆధునిక తరంలో కష్టమైన ప్రక్రియగా భావిస్తోంది యువత. ఇప్పటికీ ఎన్నో ఇళ్లల్లో పెద్దవారే చక్కగా వంట చేస్తున్నారు. నేటి కాలం కోడళ్ళు వంట చేసే తీరే మారిపోయింది. సులువుగా ఐదు నిమిషాల్లో తయారయ్యే వంటకాలను చేసి పెట్టేస్తున్నారు. వాటిని తినడం వల్ల అనారోగ్యమే తప్పా ఆరోగ్య ప్రయోజనాలు సున్నా. నిజానికి వంట చేయడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీలో అధ్యయనాన్ని నిర్వహించారు.

వంట ఒత్తిడిని తగ్గింస్తుందట తెలుసా..

ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో వంట కూడా ఒకటని చెప్పారు పరిశోధనకర్తలు. వంట చేయడం మొదలుపెడితే వారికి తెలియక ఉండాలి. ఒత్తిడి పోతుందని దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. ఎవరికైతే మానసిక ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారో వారు రోజూ వంట చేయడం అలవాటు చేసుకోవాలి. వంట చేయడం వల్ల తమపై తమకు విశ్వాసం పెరుగుతుంది. అలాగే ఇంట్లోని ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. దీని వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీకు వంట రాకపోయినా…అమ్మతో కలిసి చేస్తుంటే.. చాలా టైమ్‌ పాస్‌ అవుతుంది. హాయిగా ఉంటుంది. చాలా మంది.. టెన్షన్‌గా ఉన్నా, ఒత్తిడి, బాధ, కోపం ఇలాంటివి ఉంటే.. వంట చేస్తుంటారు. అలా వాళ్లకు నచ్చినవి వండుకోని తినడం వల్ల డొపమైన్‌ అనే హ్యాపీ హార్మోన్‌ రిలీజ్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news